Ada Sharma: నేను ప్రముఖుల కుటుంబం నుంచి వచ్చుంటే ఓ పర్ఫెక్ట్ రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చేదాన్ని.. నెపోటిజంపై యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ హీరోయిన్ అదా శర్మ (Ada Sharma) ‘హార్ట్ ఎటాక్’ (Heart attack) చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

Ada Sharma: నేను ప్రముఖుల కుటుంబం నుంచి వచ్చుంటే ఓ పర్ఫెక్ట్ రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చేదాన్ని.. నెపోటిజంపై యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అదా శర్మ (Ada Sharma) ‘హార్ట్ ఎటాక్’ (Heart attack) చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు ఈ బ్యూటీ. కానీ.. 2023లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ మూవీలోని అదా యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి అనడంలో అతిశయోక్తి లేదు. దీని తర్వాత ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ (Bastar: The Naxal Story)లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల బాలీవుడ్ నెపోటిజంపై స్పందించిన ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ (horror) చిత్రంతో నా సినీ లైఫ్‌ను స్టార్ట్ చేశాను. అయితే.. నేను ఓ సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తిని అయుంటే.. నన్ను వెండితెరకు పరిచయం చేయడానికి ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సినిమా ఎంచుకునేవారు. నా కుటుంబం నన్ను హారర్ సినిమా చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే తన బిడ్డ కెరీర్‌ను నల్లటి పళ్లతో దెయ్యం పట్టినట్టు మొట్టమెదటి సారి చూపించడానికి ఎవరు ఒప్పుకుంటారు. అందుకే ప్రముఖుల కుటుంబం నుంచి నేను వచ్చుంటే ఓ రొమాంటిక్ చిత్రంతో నా ఎంట్రీ ఉండేది.. కానీ నేను ‘1920’తో స్టార్ట్ చేశాను. అందుకు నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఏదైనా కొత్తగా ప్రయత్నించే అవకాశం నాకు ఉంటుంది. అలాగే.. నేను ప్రయత్నించే ప్రతి కొత్త విషయాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. బహుశా అందుకే సినీ నిర్మాతలు కూడా నాకు విభిన్న పాత్రలు ఇవ్వడానికి చూస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story