Sai Pallavi: కలైమామణి అవార్డు అందుకున్న సాయి పల్లవి.. ఆసక్తికర పోస్ట్

by Ramesh Naini |   (  Updated:2025-11-17 14:17:03  IST  )

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళా రంగాలలో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కలైమామణి అవార్డు.

Sai Pallavi: కలైమామణి అవార్డు అందుకున్న సాయి పల్లవి.. ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళా రంగాలలో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కలైమామణి అవార్డు. సాహిత్యం, సంగీతం, నాటకం, భరతనాట్యం, సినిమా, జానపద కళలు, చిత్రలేఖనం, శిల్పం వంటి వివిధ కళా రంగాలలోని కళాకారులకు ఈ అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది. ఇటీవల ప్రముఖ నటి సాయి పల్లవి, సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలైమామణి అవార్డును అందుకున్నారు. గత నెల అక్టోబర్ 11నే అవార్డు అందుకున్నప్పటికీ.. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను నటి సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

కలైమామణి అనే పదం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చానని తెలిపారు. రాష్ట్ర సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ అమూల్యమైన పోస్టు నా ప్రియమైన వారితో కలిసి ఒక ఫోటో తీసుకునేందుకు నెల రోజులు ఆలస్యమైందని ఫోటోలను పంచుకున్నారు.

Next Story