మా స్వేచ్ఛను కోల్పోతున్నాం.. బీఫ్, పోర్న్ బ్యాన్ పై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-23 15:24:44  IST  )

దేశంలో బీఫ్ అమ్మకాలు, పోర్న్ వీడియోల మీద బ్యాన్ విధించడంపై బాలీవుడ్ నటి కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కైరా గతంలోనే ఈ వ్యాఖ్యలు చేయగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మా స్వేచ్ఛను కోల్పోతున్నాం.. బీఫ్, పోర్న్ బ్యాన్ పై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో బీఫ్ అమ్మకాలు, పోర్న్ వీడియోల మీద బ్యాన్ విధించడంపై బాలీవుడ్ నటి కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కైరా గతంలోనే ఈ వ్యాఖ్యలు చేయగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న కియారా అద్వానీ మొదట బీఫ్, ఇప్పుడు పోర్న్ ను బ్యాన్ చేయడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. తరవాత దేన్ని బ్యాన్ చేస్తారో ఎవరికీ తెలియదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 69ఏళ్లు గడిచినా మిలియన్ల కొద్ది స్వతంత్య్రాన్ని పొందలేకపోతున్నారని చెప్పారు.

తన దృష్టిలో ఫ్రీడ‌మ్ అంటే త‌ను చేయాల‌నుకునే, త‌ను ప్రేమించే ప్ర‌తి పని చేయ‌డ‌మే అని చెప్పారు. తాను అలాంటి ఫ్రీడ‌మ్ లోనే పెరిగాన‌ని చెప్పారు. అంతే కాకుండా ఆ ఫ్రీడ‌మ్ ను ప్ర‌తిఒక్క‌రూ స‌రైన మార్గంలో వాడుకోవాల‌ని అన్నారు. కియారా చేసిన వ్యాఖ్య‌ల‌పై గ‌తంలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. భార‌త‌దేశం సంప్రదాయ దేశం అని ఇక్క‌డ అలాంటివి కుద‌ర‌వ‌ని మంచి కోసం మాట్లాడాలి కానీ చెడు కోసం స్వేచ్ఛ లేద‌ని చెప్ప‌డం ఏంటి అంటూ ప‌లువురు మండిప‌డ్డారు. కాగా ఇప్పుడు నెటిజ‌న్లు మ‌రోసారి ఈ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

Next Story