- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 వారాలపాటు మోసాను.. చివరకు నా బిడ్డను కోల్పోయానంటూ నటి ఎమోషనల్ కామెంట్స్
బుల్లితెర నటి సమీరా(Sameera Sherief ) సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది.

దిశ, సినిమా: బుల్లితెర నటి సమీరా(Sameera Sherief ) సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత యాంకర్‌గా కూడా వ్యవహరించి పలు షోస్‌తో ప్రేక్షకులను అలరించింది. అలాగే పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేక పోయింది. వరుస ఆఫర్లతో కెరీర్ పీక్స్‌లో ఉండగా.. 2019లో పెళ్లి చేసుకుంది. ఇక 2021లో ఓ కుమారుడు జన్మించాడు. సమీరా గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ ఫ్లాగ్స్, రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా, సమీరా ఓ వ్లాగ్ చేసింది. తన సెకండ్ ప్రెగ్నేన్సీపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘2023లో నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. దీంతో ఈ విషయం తెలుసుకున్న నా ఫ్యామిలీ కూడా సంతోషించారు. నా బాబు కూడా నా కడుపులో ఉన్న బేబీతో మాట్లాడేవాడు. చెకప్‌కు వెళ్తే కూడా గ్రోత్ బాగుందని చెప్పారు. కానీ ఓ సారి జనరల్ చెకప్‌కు వెళ్లగా బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పడంతో నేను అక్కడే కుప్పకూలిపోయాను. ప్రాణం లేని బిడ్డను 12 వారాల పాటు నేను మోసాను కానీ నా బిడ్డను కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నా ఫ్యామిలీ చాలా బాధపడ్డారు’’ అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సమీరాకు ధైర్యం చెబుతున్నారు.






