- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Kishan: మనం అలా ఉంటే డబ్బు అదే వస్తుంది.. రేసు గుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్
నటుడు రవి కిషన్ అందరికి సుపరిచితమే.

దిశ, సినిమా: నటుడు రవి కిషన్ అందరికి సుపరిచితమే. రేసుగుర్రం, కిక్ 2, హీరో, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నాఫ్ సర్దార్-2 మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. తన చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చాడు. ‘నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని చూసి నేనే అసహ్యించుకున్నా. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. అప్పట్లో సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. దీంతో కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం.
చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. పేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి.. అయిన వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు అలా చాలామంది వెక్కిరించే వారు. నా తండ్రిని ఎవరూ తక్కువగా చూడకూడదని, అలాంటి స్థాయిలో నేను ఉండాలని చిన్నతంలోనే బలంగా నిర్ణయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే!.. కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు అదే వస్తుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకమే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది’ అని అన్నారు రవి కిషన్.






