- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి రమ్యను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు.. హీరో ఫ్యాన్స్‌పై కేసు !
ప్రముఖ కన్నడ నటి రమ్య ( Ramya) అలియాస్ దివ్య గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కన్నడ నటి రమ్య ( Ramya) అలియాస్ దివ్య గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. స్టార్ నటిగా ఆమె ఎదిగారు. అయితే అలాంటి.. నటి రమ్య సంచలన ఆరోపణలు చేశారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ ( Hero Darshan) ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి రమ్య.
అంతేకాదు కన్నడ హీరో దర్శన్ అభిమానులపై కేసు కూడా పెట్టారు. తనను ట్రోల్ చేయడంతో పాటు అత్యాచారం చేస్తామని.. చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటి రమ్య చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హీరో దర్శన్ కు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని.. తీవ్రంగా వ్యతిరేకించారు కన్నడ నటి రమ్య.
అతని అరెస్టు సమయంలో చట్టానికి ఎవరు అతీతులు కారు అంటూ... బాంబు పేల్చారు నటి రమ్య. దీంతో అప్పటినుంచి నటి రమ్యను.... టార్గెట్ చేసిన కన్నడ హీరో దర్శన్ అభిమానులు... సోషల్ మీడియా వేదికగా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అత్యాచారం చేసి చంపేస్తామని కూడా రచ్చ చేశారు.






