- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
దిగ్గజ మలయాళ(Malayalam) నటుడు మోహన్ లాల్(Mohanlal)కు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ మలయాళ(Malayalam) నటుడు మోహన్ లాల్(Mohanlal)కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke Award 2023) అవార్డు ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డును అనౌన్స్ చేసింది. ఈనెల 23వ తేదీన మోహన్ లాల్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా, మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు స్వీకరించారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘వాన ప్రస్థం’ సినిమాకు గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభచూపిన మోహన్‌లాల్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.






