ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-18 17:28:50  IST  )

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు.

ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ చందానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫిష్ వెంకట్(Fish Venkat) కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

కాగా, ముషీరాబాద్ మార్కెట్‌లో చాపల వ్యాపారంతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వందకు పైగా చిత్రాల్లో నటించారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, దిల్, ఆది, ఢీ, కింగ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Next Story