- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం..వేరే ఆస్పత్రికి తరలింపు
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. కళ్లు కూడా తెరవలేని పరిస్థితిలో ఉండటంతో వేరే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరోవైపు ఫిష్ వెంటక్ కుటుంబం తాము ఆపరేషన్ చేయించలేని స్థితిలో ఉన్నామని ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటోంది.
ప్రభాస్ షిఫ్ వెంకట్ కోసం సాయం చేసేందుకు ముందుకొచ్చారు అంటూ వార్తలు రాగా అది ఫేక్ కాల్ అని తేలింది. మరోవైపు ఫిష్ వెంకట్ తో కలిసి నటించిన బడా హీరోలు ఎవరూ ఆయనకు ఇప్పటి వరకు సాయం చేయలేదు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చికిత్స కోసం రూ.2 ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు ఆయనను పరామర్శించి చికిత్సకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






