- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Actor Akash : 'సునీల్'కి కృతజ్ఞత భావం లేదు.. అందాల రాముడు టైంలో జరిగింది అదే
Actor Akash : నేను నటించిన పిలిస్తే పలుకుతా సినిమాలో నాకు స్నేహితుడి పాత్రలో సునీల్ నటించాడు. ఆ సమయంలో నేను ఆయనకు మాట ఇచ్చాను. మాట ఇచ్చినందుకు అందాల రాముడులో నటించాను. కానీ ఆయన సినిమా విడుదల అయిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకోలేదు, ఆయనకు కృతజ్ఞత భావం లేదని ఆకాష్ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : నటుడు ఆకాష్ కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సునీల్ గురించి అనేక ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ఆకాష్ మాట్లాడుతూ... నేను హీరోగా నటించిన పిలిస్తే పలుకుతా చిత్రంలో సునీల్ నాకు స్నేహితుడి పాత్రలో నటించాడు. ఆ సమయంలో నేను సునీల్ కి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఆయనకు అందాల రాముడు సినిమాలో హీరోగా అవకాశం వచ్చిన సమయంలో అందులో రెండవ హీరో పాత్ర ఉంది. అది నువ్వు చేస్తే చాలా బాగుంటుందని, నీ ఇమేజ్కి తగ్గట్లు ఆ కథలో మార్పులు, చేర్పులు చేయిస్తానని అన్నాడు.
ఆ సమయంలో నేను తమిళ్లో ఓ సినిమా చేస్తున్నాను. నేను మాట ఇచ్చాను, కాబట్టి ఆ మాట అస్సలు తప్పకూడదనే ఉద్దేశంతో నేను చేస్తున్న తమిళ సినిమాని ఆపేసి సునీల్ హీరోగా రూపొందుతున్న అందాల రాముడు సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అందాల రాముడు సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులన్నీ సాయంత్రం షూటింగ్ పూర్తికాగానే సునీల్ నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని ఇవి కాళ్లు అనుకోండి భయ్యా, చాలా థ్యాంక్స్, ఈ సినిమా చేస్తున్నందుకు అని అనేవాడు.
ఇక సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించాక ఏ ఇంటర్వ్యూలో కూడా తన గురించి ప్రస్తావించలేదని, అలాగే ఏ పోస్టర్లో కూడా తన ఫోటో వేయలేదని, దానితో అతని ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఆయనకు కృతజ్ఞత భావం కూడా లేదని, ఇదే విషయాన్ని నేరుగా ఆయనకు కూడా చెప్పినట్లు ఆకాష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఆకాష్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. సునీల్ మాత్రం అనేక భాషల సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన రీతిలో కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు.






