అచ్చతెలుగింటి ఆడపిల్లలా స్టార్ బ్యూటీ.. వైట్ శారీలో ఏంజెల్‌లా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-10 07:28:15  IST  )

స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం ‘పరాశక్తి’(Parasakthi) మూవీలో నటిస్తోంది.

అచ్చతెలుగింటి ఆడపిల్లలా స్టార్ బ్యూటీ.. వైట్ శారీలో ఏంజెల్‌లా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం ‘పరాశక్తి’(Parasakthi) మూవీలో నటిస్తోంది. తమిళ స్టార్ శివ కార్తికేయన్(sivaKarthikeyan) హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వం వహిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్(Akash Bhaskaran) ఈ చిత్రాన్ని నిర్మించారు. 60వ దశకంలో తమిళనాడు రాష్ట్రంలో సాగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇందులో రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పరాశక్తి చిత్రం రిలీజ్ అయింది.

ఈ నేపథ్యంలో శ్రీలీలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తెలుగింటి ఆడపిల్లలా చీరలో చూడముచ్చటగా కనిపించింది. వైట్ శారీలో వైట్ కమ్మలు, హ్యాండ్‌కు వాచ్, పెద్ద బొట్టు, ముత్యాల హారం వేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు వైట్ శారీలో ఏంజెల్‌లా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story