‘రాజాసాబ్’ పాటలతో పండగే..

by Sujitha Rachapalli |

రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఫ్యాన్స్‌కు ముందే సంక్రాంతి పండుగను తీసుకురానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. మూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందనే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన ‘సహన సహన’

‘రాజాసాబ్’ పాటలతో పండగే..
X

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఫ్యాన్స్‌కు ముందే సంక్రాంతి పండుగను తీసుకురానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. మూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందనే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన ‘సహన సహన’ సాంగ్ మంచి మెలోడీగా నిలవగా.. నిధి అగర్వాల్, డార్లింగ్ కెమిస్ట్రీ అదిరిపోయిందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. థమన్ మ్యూజిక్‌కు మంచి మార్కులు పడగా.. ఈ చిత్రంలో సాంగ్స్‌‌తో డార్లింగ్ అభిమానులకు పండగే అంటున్నారు విశ్లేషకులు. ఇంట్రో సాంగ్, మెలోడీ సాంగ్ అదిరిపోగా.. ముగ్గురు హీరోయిన్లతో పాట నెక్స్ట్ లెవల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాట కీలక సమయంలో వస్తుందని.. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుందని టాక్.

Next Story