11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్

by Chukka Sudharani |

‘హ్యాపీ రాజ్’ చిత్రంతో ‘ప్రేమదేశం’ చిత్రంతో అప్పట్లో సెన్సేషన్ అయిన అబ్చాస్ 11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాాడు.

11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్
X

దిశ, సినిమా: స్టార్ హీరో జీవీ ప్రకాష్ కుమార్, ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ఈ సినిమా ఈ నెల 27న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘ప్రేమదేశం’ చిత్రంతో అప్పట్లో సెన్సేషన్ అయిన అబ్బాస్ కనిపించి అందరికి ఆశ్చర్యపరిచాడు. 2015లో నటనకు దూరమయిన అబ్బాస్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ‘హ్యాపీ రాజ్’లో కనిపించడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మరియా రాజా అబ్బాస్ నటించడంపై మాట్లాడుతూ.. ‘మంచి కథ ఉంటే రీ ఎంట్రీ ఇచ్చేందుకు అబ్బాస్ చాలా కాలంగా వేచి చూశారు. ఈ క్రమంలోనే ఎన్నో కథలు విన్నా ఆయనకు నచ్చలేదని తెలిసింది. న్యూజిలాండ్‌లో ఉంటున్న ఆయనకు ఆన్‌లైన్ ద్వారా ఈ సినిమా కథ చెప్పా. వెంటనే ‘రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఇది పర్‌ఫెక్ట్ స్టోరీ’ అని చెప్పి ఒప్పుకున్నారు. ఆయన నటించడానికి ఒప్పుకున్నారంటే దానికి ప్రధాన కారణం ఈ సినిమా కథే’ అని తెలిపారు. హీరో - డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

Next Story