‘ఓరయ్యో సాంగ్’లో సమంత, రోహిణి నేను నిజంగానే చనిపోయినట్లు ఏడ్చారు’.. రంగస్థలం నటుడు కామెంట్స్

by Kodari Anjali |

ఫెంటాస్టిక్ మూవీ రంగస్థలం(Rangasthalam) తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘ఓరయ్యో సాంగ్’లో సమంత, రోహిణి నేను నిజంగానే చనిపోయినట్లు ఏడ్చారు’.. రంగస్థలం నటుడు కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫెంటాస్టిక్ మూవీ రంగస్థలం(Rangasthalam) తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) కథాయకుడిగా నటించగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) హీరోయిన్ గా కనిపించి.. జనాల్ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని ప్రతి ఒక్క సన్నివేశం, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఓ సన్నివేశం అయితే థియేటర్లలోనే జనాల్ని కంటతడి పెట్టించింది.

అయితే చరణ్ అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి (Aadi Pinisetty)నటించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో ఆది మరణిస్తాడు. అంత్యక్రియలు కార్యక్రమం సమయంలో ఓరయ్యో అంటూ సాగే పాట వస్తుంది. ఇక ఆది పినిశెట్టి, రామ్ చరణ్ తల్లిగా రోహిణి(Rohini) నటించి మెప్పించింది. అయితే ఆది పినిశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. రంగస్థలం మూవీలోని ఎమోషనల్ సీన్ ను గుర్తు చేసుకున్నారు.

మూవీలో నేను చనిపోయిన పాత్ర చేసినప్పుడు రోహిణి, సమంత నిజంగానే నేను మరణిస్తున్నట్లు ఏడ్చారని వెల్లడించాడు. ఈ ఏడుపులు వింటే నాకు నిజంగానే చాలా భయంగా అనిపించిందని.. మనం మరణిస్తే ఈ విధంగానే ఏడుస్తారు కావచ్చని అనిపించిందని పేర్కొన్నాడు. అయితే రోహిణి తన హస్బెండ్ మరణించింది గుర్తు చేసుకుని అంతలా ఏడ్చానని చెప్పారని అన్నాడు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story