- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ-సిరీస్ చేతికి 'AA 23' ఆడియో హక్కులు
అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న 'AA 23' చిత్ర ఆడియో హక్కులను టీ-సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ చిత్రాల ద్వారా ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సెటప్ తెలిపే విధంగా ఉన్న కొన్ని వీడియోలను మేకర్స్ విడుదల చేశారు. అవి అద్భుతంగా హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉండడంతో ఈ సినిమాతో బన్నీ మరో విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఓవైపు అట్లీతో సినిమా చేస్తూనే మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు బన్నీ కమిట్ అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో 'AA 23' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుద్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ సంగీత హక్కులను టీ-సిరీస్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. లోకేష్ కెరీర్ బిగినింగ్లో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈయన దర్శకత్వం వహించిన ఆఖరి రెండు చిత్రాలు లియో, కూలీ అపజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ దర్శకుడి క్రేజ్ చాలా వరకు పడిపోయింది.






