రిలీజ్‌కు ముందు ఈషా నుంచి వార్నింగ్ వీడియో.. ఆత్మంటే అదేనేమో అంటూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారుగా..

by I. Sairam |

ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’.

రిలీజ్‌కు ముందు ఈషా నుంచి వార్నింగ్ వీడియో.. ఆత్మంటే అదేనేమో అంటూ  వెన్నులో వణుకు పుట్టిస్తున్నారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే ఇందులో సిరి హనుమంత్. పృథ్వీ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్స్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి.

అయితే డిసెంబర్ 25న విడుదల కానున్నది. ఇక వీడియో కంటెంట్ తోనే ఇంత భయపెడుతున్న ‘ఈషా’.. వెండితెరపై ఇంకెలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి మేకర్స్ ‘వార్నింగ్ వీడియో’ పేరిట ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు.

సాధారణంగా హారర్ సినిమాలకు ట్రైలర్లు రావడం సహజం, కానీ ఇలా ప్రత్యేకంగా హెచ్చరిక వీడియో రావడం హారర్ జానర్‌లోనే ఇదే తొలిసారి. ఇక వార్నింగ్ వీడియోలో అతి భయంకర సన్నివేశాలు రిలీజ్ చేశారు. 50 సెకన్లు నిడివి గల ఈ వీడియోలో చివరగా ఆత్మంటే అదేనేమో అనే చెప్పే డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్నింగ్ వీడియోనెట్టింట వైరల్‌గా మారింది.

Next Story