- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas : ప్రభాస్ పేరుతో నేపాల్ లో పట్టణం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కు దేశ విదేశాలలో అభిమానుల క్రేజ్(Craze) అంతా ఇంతా కాదు. పలు ప్రాంతాల్లో ప్రభాస్ పేరిట అభిమాన సంఘాలు చేసే కార్యక్రమాలు ఆయనకున్న క్రేజ్ ను చాటుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కు దేశ విదేశాలలో అభిమానులక్రేజ్(Craze) అంతా ఇంతా కాదు. పలు ప్రాంతాల్లో ప్రభాస్ పేరిట అభిమాన సంఘాలు చేసే కార్యక్రమాలు ఆయనకున్న క్రేజ్ ను చాటుతుంటాయి. మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ బ్యాంకాక్, లండన్ మ్యూజియంలలో తొలిసారి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రభాస్ స్థానం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.
అలాగే స్టేడియంలకు, రైల్వే స్టేషన్లకు ప్రముఖుల పేర్లు పెట్టడం చూస్తుంటాం. సచిన్, కోహ్లీల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పేరుతో జిల్లాలు, పట్టణాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.
ఇది ఇలా ఉండగా.. మన బాహుబలి ప్రభాస్ పేరిట పొరుగు దేశం నేపాల్ లో ఓ పట్టణం(A Town In Nepal Named Prabhas) ఉన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తెలుగు వాడైనా ఓ మోటో బ్లాగర్ నేపాల్ పర్యటన చేస్తున్నాడు. రైడ్ లో బైక్ పై వెళుతుండగా అతనికి ప్రభాస్ పేరుతో ఉన్న చిన్న పట్టణం కనిపించింది. వెంటనే మనోడు ఆనందంతో ఓ వీడియో చేసి డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ సోషల్ మీడియా లో వీడియో షేర్ చేశాడు.
ఇంకేముంది అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పట్టణం మొదటి నుంచి కూడా ప్రభాస్ పేరుతోనే కొనసాగుతోంది. మరోవైపు ప్రభాస్ పేరుతో పట్టణం వీడియో వైరలైన తీరు ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనమంటూ ఆయన అభిమానులు పొంగిపోతున్నారు.
ప్రభాస్ కు జపాన్, చైనా, అమెరికా మాదిరిగానే నేపాల్ దేశంలోనూ భారీగా అభిమానులున్నారు. బాహుబలి, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలు నేపాల్ లో భారీ వసూళ్లను సాధించాయి. ప్రభాస్ హిట్ చిత్రం సలార్ ను మార్చి 21న మరోసారి రీరిలీజ్ చేయనుండటం ఆయన అభిమానులను మరింత సంతోష పెడుతోంది.






