మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి అనుమానాస్పద మృతి

by Kema Shiva Kumar |

మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పీటర్ గ్రీన్ (Peter Green) (60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ 12న న్యూయార్క్‌ (New York)లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ఆయన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. పీటర్ గ్రీన్ మరణాన్ని ఆయన మేనేజర్ గ్రెగ్ ఎడ్వర్డ్స్ (Greg Edwards) కూడా ధృవీకరించారు. పొరుగు వారు అపార్ట్‌మెంట్‌లో గురువారం నుంచి క్రిస్మస్ సంగీతం గట్టిగా వినిపిస్తూ ఉండటంతో పోలీసులకు సమాచారం అందజేశారు. తలుపు తెరిచి చూడగా పీటర్ గ్రీన్ రక్తపు మడుగులో బోర్లా పడి ఉన్నాడని.. అయితే, గదితో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు పీటర్ గ్రీన్ మరణంపై సస్పెన్స్ వీడలేదు. న్యూయార్క్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్‌ (New York Medical Examiner's Office)లో పోస్టు‌మార్టం నిర్వహించిన తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆయన ఎలా చనిపోయారనే విషయాన్ని బయటపెట్టనున్నారు.

కాగా, పీటర్ గ్రీన్ 1994లో వచ్చిన ‘పల్ప్ ఫిక్షన్’లో జెడ్ పాత్ర, ‘ది మాస్క్’లో డోరియన్ టైరెల్ పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ‘ది యూజువల్ సస్పెక్ట్స్’, ‘ట్రైనింగ్ డే’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే.

Next Story