- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి, నిర్మాత కన్నుమూత
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి(Krishnaveni) తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఇక కృష్ణవేణి మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సీనియర్ హీరో నందమూరి తారక రామారావు(Sr. NTR)ను సినీరంగానికి హీరోగా పరిచయం చేశారు కృష్ణవేణి. ఆమె నిర్మించిన ‘మన దేశం’(Mana Desham) చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. అలాగే దివంగత సంగీత దర్శకుడు ఘంటసాల(Ghantasala)ను సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి.
అక్కినేని నాగేశ్వర రావుతో చాలా సినిమాలు తీసిన నిర్మాత. కృష్ణవేణి నటిగా, నిర్మాతగానే కాకుండా నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 1939లో మీర్జాపురం జమీందారును వివాహం చేసుకుంది కృష్ణవేణి. అప్పట్లో వాళ్లకు శోభనాచల స్టూడియో ఉండేది. ఆ తర్వాత దానిని వీనస్ స్టూడియోగా మార్చారు. 1949లో విడుదలైన మన దేశం సినిమా ద్వారా ఆమె నిర్మాతగా ఎంతో మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. ఇంతటి మహానుభావులను పరిచయం చేసిన కృష్ణవేణి మన మధ్య లేకపోవడం నిజంగా విచారించదగ్గ విషయమే.






