- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సీనీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీనీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పుష్పలత (Pushpalatha) (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు. ‘కొంగునాట్టు తంగం’ అనే చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎంఎస్ రాజేంద్రన్ వంటి అగ్రనటుల సరసన నటించారు. ‘నానుమ్ ఒరు పెణ్’ అనే చిత్రంలో నటుడు ఏవీఎం రాజన్‌తో నటించారు. ఆ తరువాత ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం.
తెలుగు (Telugu)లో పుష్పలత చెడపకురా చెడేవు, పెద్ద కొడుకు, ఆడబిడ్డ, రాము, మేము మనుషులమే, అన్నదమ్ముల అనుబంధం, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, రాధా కళ్యాణం, కొండవీటి సింహం, యుగ పురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా పుష్పలత కూతురు మహాలక్ష్మి హీరోయిన్‌గా రెండు జడల సీత, ఆనంద భైరవి చిత్రాలు నటించారు. అదేవిధంగా 1963లో ‘మైన్ భీ లక్కీ హూన్’ అనే హిందీ చిత్రంలో, ‘నర్స్’ (Nurse) అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. ‘సకలకళా వల్లభన్’, ‘నాన్ అడిమై ఇల్లై’ వంటి చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. చివరగా ఆమె ‘పూవాసమ్’(1999) చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆమె మృతిపై పలువురు తమిళ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.






