'అఖండ-2' విడుదల వాయిదా.. అఘోర గెటప్‌లో వచ్చి అభిమాని ఎమోషనల్

by Ajay Maddhiboyina |

బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ 2 సినిమా వాయిదా పడింది. మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా నిర్మాణ సంస్థ‌కు

అఖండ-2 విడుదల వాయిదా.. అఘోర గెటప్‌లో వచ్చి అభిమాని ఎమోషనల్
X

దిశ‌, వెబ్ డెస్క్: బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ 2 సినిమా వాయిదా పడింది. మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా నిర్మాణ సంస్థ‌కు చెందిన కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే సినిమా వాయిదా ప‌డ‌టంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని ఎమోష‌న‌ల్ అయ్యారు. అఖండలో బాల‌య్య గెటప్ తో వ‌చ్చిన అభిమాని అఖండ గెట‌ప్ వేసుకోవ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ రోజు సినిమా విడుద‌ల కావాల్సి ఉంద‌ని కానీ కొన్న అనివార్య కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌వ్వ‌లేద‌ని చెప్పారు.

దుర‌దృష్టం అని ఎవ‌రూ అన‌కూడ‌ద‌ని అదృష్టంగానే భావించాల‌న్నారు. ఏది జ‌రిగినా కూడా మ‌న మంచికే జ‌రిగింద‌ని అనుకోవాల‌న్నారు. కానీ అభిమానులుగా చాలా బాధ‌తో ఉన్నామ‌ని చెప్పారు. బాధ తొల‌గిపోవాలి అంటే రేపు ఉద‌యం 8గంట‌ల‌కు షో వేయాల‌న్నారు. అప్పుడు కాస్త ఆనందంగా ఉంటామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే అఖండ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వ‌స్తోంది. ఈ చిత్రానికి బాల‌య్య హీరోగా న‌టించ‌గా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. VIDEO

Next Story