- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుంది.. ఉత్సాహంగా ఉండండి.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram).

దిశ, వెబ్‌డెస్క్: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్(P.Kiran) నిర్మిస్తుండగా.. అశ్వనీదత్(Ashwin dutt) సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందంటూ డైరెక్టర్ అజయ్ భూపతి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘ప్రేమతో రాసి, అందంతో ముసాయిదా చేయబడింది.. మొదటి షెడ్యూల్‌కి ముగింపు.. శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.. ఉత్సాహంగా ఉండండి’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






