అనిల్ రావిపూడికి రక్త తిలకం.. సినిమా కాన్సెప్ట్‌పై హింట్ ఇచ్చిన టీమ్

by Pulgam srinivas |

అనిల్ రావిపూడి తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా తన కొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

అనిల్ రావిపూడికి రక్త తిలకం.. సినిమా కాన్సెప్ట్‌పై హింట్ ఇచ్చిన టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. ఈ సినిమా విషయంలో కూడా ఆయన అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి ఓ సరదా ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను దక్కించుకుంది.

తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలతో మరో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా కథా నేపథ్యం, షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ నేటి నుంచే ప్రారంభం కానుండగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగనున్నట్లు తెలిపారు. అయితే రాయలసీమ నేపథ్యం ఉన్నప్పటికీ, ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని స్పష్టం చేశారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వీడియోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి రక్త తిలకంతో అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. షూటింగ్ ప్రారంభం కాకముందే వరుస ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పడంలో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story