80s రీయూనియన్.. ఒకేచోట కలుసుకున్న 31 మంది సౌత్ ఇండియన్ స్టార్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-05 05:34:04  IST  )

1980 దశకంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అనుభవించిన, ఇప్పటికీ అనుభవిస్తున్నవాళ్లు హీరో హీరోయిన్లు తాజాగా గెట్ టూ గెదర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, జాకీ షార్ఫ్, శరత్ కుమార్, సుహాసిని, జయసుధ సహా మొత్తం 31మంది ఒకప్పటి హీరో హీరోయిన్లు 80s Stars Reunion పేరుతో చెన్నైలో శనివారం కలుసుకున్నారు.

80s రీయూనియన్.. ఒకేచోట కలుసుకున్న 31 మంది సౌత్ ఇండియన్ స్టార్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: 1980 దశకంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అనుభవించిన, ఇప్పటికీ అనుభవిస్తున్నవాళ్లు హీరో హీరోయిన్లు తాజాగా గెట్ టూ గెదర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, జాకీ షార్ఫ్, శరత్ కుమార్, సుహాసిని, జయసుధ సహా మొత్తం 31మంది ఒకప్పటి హీరో హీరోయిన్లు 80s Stars Reunion పేరుతో చెన్నైలో శనివారం కలుసుకున్నారు. వీరంతా పులుల లాంటి రంగుల్లో ఒకే డ్రెస్ కోడ్ తో వేడుకకు హాజరయ్యారు.

వీరంతా ప్రతి ఏడాది ఇలా రియూనియన్ ప్లాన్ చేసుకోగా గతేడాది చెన్నైలో వరదల కారణంగా వాయిదా వేసుకుని ఈ ఏడాది కలుసుకున్నారు. స్టార్ హోటల్ లో కలవాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ కోరిక మేరకు వారి ఇంట్లో ఈ వేడక ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రియూనియన్ లో పాల్గొన్న నటుల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ కాగా అభిమానులు కుషీ అవుతున్నారు. ఈ రియూనియన్ వేడుక ఇండస్ట్రీలోని స్టార్స్ మధ్య ఉండే ఐకమత్యానికి ప్రతీక అంటున్నారు.

Next Story