జులైలో బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే

by Naga Rani Yarlagadda |

ఇటీవల కాలంలో రీ రిలీజ్ లకు డిమాండ్ పెరిగింది. కొత్తగా రిలీజవుతున్న సినిమాల కంటే రీ రిలీజ్ మూవీలు చూసేందుకే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు.

జులైలో బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో రీ రిలీజ్ లకు డిమాండ్ పెరిగింది. కొత్తగా రిలీజవుతున్న సినిమాల కంటే రీ రిలీజ్ మూవీలు చూసేందుకే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఓయ్, ఖలేజా వంటి సినిమాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.

జులై నెలలో ఏకంగా 6 సినిమాలు రీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. జులై 7న ఎంఎస్ ధోని, 10న కుమారి 21 ఎఫ్, జులై 11న మిరపకాయ్, జులై 18న గజిని, ఏమాయ చేశావె, జులై 19న వీడొక్కడే సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. వీటిలో కుమారి 21 ఎఫ్, గజిని, ఏమాయ చేశావె సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. వాటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో ఈ సినిమాలు రీ రిలీజ్ సమయంలో ఏవైనా సినిమాలు రిలీజై వాటికి మంచి టాక్ లేకపోతే కలెక్షన్లతో గట్టెక్కడం కష్టమే. ఈ ఆరు సినిమాల్లో ఏ రీ రిలీజ్ కు హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Next Story