- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18 Years of Gamyam: తెలుగు చిత్ర సీమలో మధుర కావ్యం
18 Years of Gamyam: టాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటి అయినటువంటి గమ్యంకి నేటితో 18 ఏళ్లు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే క్లాసిక్ అవుతుంటాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప సినిమాల లిస్టులో నిలిచిపోయిన వాటిలో గమ్యం ఒకటి. ఈ సినిమాలో శర్వానంద్, అల్లరి నరేష్, కమిలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సమయంలో వీరెవరికీ పెద్దగా గుర్తింపు లేదు. దానితో ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది.
కానీ రిలీజ్ తర్వాత పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలో క్రిష్ సాధారణమైన కథను తీసుకున్నాడు, కానీ ఎంతో గొప్పగా దాన్ని తెరపై చూపించాడు. ఒక ధనవంతుడైన అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని మొదట పెద్దగా పట్టించుకోడు. కానీ ఆమె దూరమైన తర్వాత ఆమె కోసం ఒక ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో అల్లరి నరేష్ పాత్ర అతనికి ఎదురవుతుంది. దొంగగా ఉన్న ఆయన జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు అనేదాన్ని చూపిస్తారు.
ఇక ఆఖరుగా ఆయన చనిపోయిన సమయంలో శర్వానంద్ పాత్రతో అసలు జీవితం అంటే ఏమిటి అనే పరమార్థాన్ని చూపిస్తాడు. ఇలా గమ్యం సినిమా చాలా చిన్న కథతో ప్రారంభమైనా ఎంతో లోతుగా జీవితాలను చూపిస్తుంది. ఇలా క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి గాను ప్రేక్షకుల, విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ సినిమా 2008 ఫిబ్రవరి 29న విడుదల అయింది. నేటితో ఈ సినిమా విడుదల అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది.






