వాహన దారులకు హెచ్చరిక.. ‘నెంబర్ ప్లేట్’ లేకుంటే అంతే సంగతులు!

by  |
వాహన దారులకు హెచ్చరిక.. ‘నెంబర్ ప్లేట్’ లేకుంటే అంతే సంగతులు!
X

దిశ, హుజురాబాద్ రూరల్: ప్రతీ వాహనానికి వెనక, ముందు నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వాహనాల తనఖీలు నిర్వహించారు. సుమారుగా 70 నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలకు అన్ని రకాల పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నెంబర్ ప్లేట్స్ లేకుంటే జరిగే నష్టాలను వివరించారు. మద్యం తాగి వాహనాలు నడుపవద్దని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురైన వ్యక్తులకు ఇన్సూరెన్స్ వర్తించదని గుర్తు చేశారు.

తప్పకుండా హెల్మెట్ వాడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను ఎప్పటికప్పడు క్లియర్ చేసుకోవాలని కోరారు. కొంత మంది కావాలనే ప్రెస్, పోలీస్ స్టిక్కర్ వేసుకుంటున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా మిత్రులు ప్రభుత్వం నుంచి జారీ చేసిన అక్రిడేషన్ కార్డు కలిగి ఉండాలని లేనియెడల గుర్తుంపు పొందిన పత్రికా సంస్థ నుంచి ఐడీ కార్డులు ఉండాలని చెప్పారు. నెంబర్ ప్లేట్స్ లేనివారు వెంటనే తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పత్రాలు ఉంటేనే వాహనాలను రిలీజ్ చేస్తామన్నారు. అన్ని రకాల పత్రాలు ఉన్న వారికి ఎలాంటి జరిమానాలు విధించమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై చీనానాయక్, ఏఎసై రవి, సిబ్బంది కరుణాకర్‌తో పాటు తదితరులు ఉన్నారు.


Next Story