‘ఆచార్య’కు సమస్యగా మారిన సోనూసూద్

by Shyam |
‘ఆచార్య’కు సమస్యగా మారిన సోనూసూద్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ తర్వాత తన దగ్గరకు విలన్ పాత్రలు కాకుండా, నిజజీవితంలో హీరో పాత్రలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు రియల్ హీరో సోనూసూద్. జనం కూడా తనను అలాగే చూడాలని అనుకుంటున్నారని.. ఇకపై విలన్ పాత్రలు చేయకపోవచ్చని వెల్లడించారు. కానీ ఇంతకు ముందే విలన్‌గా కమిట్ అయిన సినిమాలను మాత్రం తప్పక పూర్తి చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ గురించి తెలిపిన సోను.. తను సినిమాకు పెద్ద సమస్యగా తయారయ్యానని చిరు చెప్పారన్నారు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా చిరు తనను కొట్టాల్సి ఉందని, కానీ అలా కొడితే ప్రజలు తిట్టేస్తారేమో అనే భయం ఉందన్నారని తెలిపారు. ఇక మరో యాక్షన్ సీక్వెన్స్‌లో చిరు పాదాలను తనపై ఉంచాలని.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చిత్రీకరణ కూడా జరిగిపోయిందని, కానీ మూవీ యూనిట్ దాన్ని మళ్లీ రీషూట్ చేయాలని భావిస్తోందని చెప్పుకొచ్చారు సోను.

Next Story

Most Viewed