ఏపీ సీఎంను అభినందించిన చిరు..

by  |
ఏపీ సీఎంను అభినందించిన చిరు..
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అభినందించారు. రాష్ట్రంలో ఒకే రోజు 13.72లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించడం ఉత్తమమైన నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన హెల్త్ టీమ్స్‌పై కూడా ప్రశంసలు కురిపించిన చిరు.. రాష్ర్ట మేలుకోరి చేపట్టిన ఈ పని అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందన్నారు. కొవిడ్‌ మహమ్మారిని ఓడించే క్రమంలో ప్రజల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నంగా అభివర్ణించారు. ఇంకా ఇలాగే ముందుకు సాగాలని కోరిన మెగాస్టార్.. హెల్త్ టీమ్‌కు మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Next Story

Most Viewed