మక్కలు పండిస్తం అంటే ఇక రైతుల ఇష్టం !

by  |
మక్కలు పండిస్తం అంటే ఇక రైతుల ఇష్టం !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మక్కలకు మార్కెట్ అనుకూలంగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి, జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మక్కపంటకు ఈసారి విరామం ఇస్తేనే మంచిదని పేర్కొన్నారు. కేంద్రం దిగుమతి సుంకాలు కూడా తగ్గించడం, పక్కరాష్ట్రాల్లో తక్కువ ధరలకే మక్కలు లభిస్తుండటంతో పంటసాగును నిరుత్సాహ పరుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. క్విటాలుకు రూ.800 నుంచి 900వరకే ధర పలికే అవకాశం ఉందన్నారు. అయినా మక్కలు పండిస్తామంటే ఇక రైతుల ఇష్టం అన్నారు.


Next Story

Most Viewed