ఈస్ట్ కోస్ట్ డివిజన్​ పరిధిలో రైళ్ల వేళలు మార్పు

by  |
ఈస్ట్ కోస్ట్ డివిజన్​ పరిధిలో రైళ్ల వేళలు మార్పు
X

దిశ, ఏపీ బ్యూరో: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. రాయగఢ్- విశాఖపట్నం (08507) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగఢ్​లో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నం నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగఢ్​ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్‌ స్టేషన్లలో ఆగుతుంది. పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గంలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది.



Next Story