కేసీఆర్ మాటలన్నీ బూటకం: చాడ

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఎంతమంది కరోనా పేషంట్లకైనా వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు బూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో కనీసం తిండి, వసతులు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఏమోగాని, కనీసం తిండిపెట్టకపోవడం దారుణమన్నారు. కరోనా తీవ్రమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని [&hellip;]</p>

కేసీఆర్ మాటలన్నీ బూటకం: చాడ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంతమంది కరోనా పేషంట్లకైనా వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు బూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో కనీసం తిండి, వసతులు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఏమోగాని, కనీసం తిండిపెట్టకపోవడం దారుణమన్నారు. కరోనా తీవ్రమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులను తక్కువచేసి చూపిస్తున్నారని హైకోర్టు సైతం వ్యాఖ్యానించిందన్నారు. జూనియర్ డాక్టర్లలకు రక్షణ కల్పించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు.

Next Story