ఆ నగరాల్లో ‘కరోనా’ సీరియస్ : కేంద్ర హోం శాఖ

by  |
ఆ నగరాల్లో ‘కరోనా’ సీరియస్ : కేంద్ర హోం శాఖ
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదని కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడింది. కొన్ని జిల్లాల్లో సామాజిక దూరాన్ని పాటించే చర్యలను తీసుకోవడం లేదని ఆగ్రహించింది. మార్కెట్, బ్యాంకులు, చౌక ధరల దుకాణాల ముందు, ఇతరత్రా పలుచోట్లలో లాక్‌డౌన్ ఉల్లంఘనలు కేంద్రం దృష్టికి వచ్చినట్టు హోంశాఖ తెలిపింది. ఈ ఉల్లంఘనలు ఇలాగే ఉంటే.. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ఈ ఉల్లంఘనలు ముందుకు వచ్చిన తర్వాతే.. మహారాష్ట్రలోని ముంబయి, పూణె, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని జైపూర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, ఈస్ట్ మిడ్నాపూర్, డార్జిలింగ్, జల్‌పైగురి, కాలింపోంగ్ జిల్లాలు పరిస్థితులు తీవ్రంగా దిగజారే ప్రమాదమున్నదని గుర్తించినట్టు వివరించింది. ఈ జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించి ఆ రాష్ట్రాలకు సూచనలివ్వడానికి, అలాగే, కేంద్రానికి నివేదికలు సమర్పించేందుకు ప్రత్యేకంగా ఆరు ఇంటర్‌మినిస్ట్రియల్ సెంటర్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ టీమ్‌లు వచ్చే మూడు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లోని పేర్కొన్న జిల్లాలను సందర్శించనున్నాయి. విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో ఈ టీమ్‌లను ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాలకు తరలించనుంది. కాగా, అక్కడ నివాసం, ఇతర సదుపాయాలు ఆయా రాష్ట్రాలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. కాగా, ఈ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నిర్మాణాత్మక, సహేతుక కారణాలతో ఆ టీమ్‌లను ఏర్పాటు చేస్తే తప్పపట్టబోం కానీ, ఎటువంటి కారణాలు చూపెట్టకుండానే రాష్ట్రాల్లోకి వాటిని పంపిస్తామనడం సరికాదని అన్నారు. ముందుగా సరైన కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని కాలరాయడమేనని విమర్శించారు.

TAGS: coronavirus, pandemic, outbreak, IMPACT, teams, serious situation, cities, and, states, centre


Next Story

Most Viewed