వృద్ధులు, వికలాంగులకు ఇంటికి సమీపంలోనే టీకా: కేంద్రం

by  |
వృద్ధులు, వికలాంగులకు ఇంటికి సమీపంలోనే టీకా: కేంద్రం
X

న్యూఢిల్లీ: వయోవృద్ధులు, వికలాంగులకు టీకాను మరింత చేరువ చేసేలా కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. 60ఏళ్లుపైబడిన వృద్ధులు, భౌతిక లేదా మానసిక వికలాంగుల నివాసాలకు సమీపంలోనే టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. టీకా కేంద్రాలకు వీరు దూరాలు వెళ్లడం కష్టమని, వారి సౌకర్యా్ర్థమే నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన సిఫారసులను ఆమోదించినట్టు తెలిపింది. 60ఏళ్లు నిండి మొదటి డోసు వేసుకున్నవారు లేదా వేసుకోని వారూ ఇందుకు అర్హులేనని కేంద్రం పేర్కొంది. నియర్ టు హోం టీకా కేంద్రాలను కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ గదులు, స్కూల్ బిల్డింగ్, ఓల్డేజీ హోం, ఇతర సౌకర్యాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. టీకా వేసే గది, వెయిటింగ్ హాల్, అబ్జర్వేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, టీకా కేంద్రాల్లో రద్దీ లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్ సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.



Next Story

Most Viewed