- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్వాకం.. కేంద్రం నిధులు నిలిపివేత..
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సదుపాయాల అభివృద్ధికి అందించే నిధులను తెలంగాణ రాష్ట్రానికి నిలిపివేసింది. దేశంలోని 19 రాష్ట్రాలకు రూ.8453.92 కోట్లు విడుదల చేసింది. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోవడంతో నిధులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాలకు సైతం కేంద్రం నిధులను నిలిపివేసింది. అయితే కేంద్రానికి తెలంగాణ మాత్రమే […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సదుపాయాల అభివృద్ధికి అందించే నిధులను తెలంగాణ రాష్ట్రానికి నిలిపివేసింది. దేశంలోని 19 రాష్ట్రాలకు రూ.8453.92 కోట్లు విడుదల చేసింది. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోవడంతో నిధులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాలకు సైతం కేంద్రం నిధులను నిలిపివేసింది. అయితే కేంద్రానికి తెలంగాణ మాత్రమే ప్రతిపాదనలు పంపడం మరిచిపోయింది. కాగా, ఏపీ ప్రతిపాదనలు పంపడంతో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488.16 కోట్ల ఆరోగ్య నిధులను కేంద్రం విడుదల చేసింది.
Next Story






