కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

by  |
modi
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహన రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ.25,938 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వాహనాలు, విడిభాగాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. డ్రోన్ల పరిశ్రమకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. టెలికాం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టెలికాం బకాయిల చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం ఇవ్వాలని నిర్ణయించింది.

Next Story