మహిళలకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ప్రతీ కుటుంబానికి రూ. 2 లక్షలు

by  |
మహిళలకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ప్రతీ కుటుంబానికి రూ. 2 లక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా బారిన పడి చనిపోతున్న కుటుంబాలకు ఆర్ధికంగా బీమాతో సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది.

స్వశక్తి సంఘాల సభ్యులతో పాటు జీవిత భాగస్వాములకు వర్తింప చేసే విధంగా ప్రధాన మంత్రి సురేఖ బీమా యోజన (పీఎంఎస్‌బీవై)లో చేర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీనిలో మహిళా సంఘాల సభ్యులు అందరూ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రీమియంను మహిళలు తీసుకునే వడ్డీ లేని రుణాల నుంచి లేదా గ్రూపులోని కార్పస్ ఫండ్ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.350 చెల్లించాలని పేర్కొంది.

ప్రీమియం చెల్లించిన సభ్యులు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందించనున్నారు. రాష్ట్రంలో పీఎంఎస్​బీవై కింద 41,16,977 మందిని చేర్పించాలని కేంద్రం రాష్ట్ర అధికారులకు సూచిస్తూ ఆదేశాలిచ్చింది.


Next Story

Most Viewed