రూ.2400 అప్పు.. పొట్టు పొట్టు పంచాయతీ

115

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అప్పు పంచాయతీ ఘర్షణకు దారి తీసింది. ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌బీటీ‌నగర్‌కు చెందిన రాజు దగ్గర నుంచి మస్తాన్‌‌నగర్‌ వాసి లక్ష్మయ్య రూ.2400 అప్పుగా తీసుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తిరిగి ఇచ్చే ప్రాసెస్ లేట్ అయ్యింది. దీంతో కోపం పెంచుకున్న రాజు.. లక్ష్మయ్య దగ్గరకు వెళ్లి గొడవకు దిగాడు. చిన్న పంచాయతీ ఘర్షణకు దారితీయడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. 11మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..