ఆర్టీఏ సర్వీస్ ఛార్జీల వసూలుపై హైకోర్టులో కేసు

by  |
RTA
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం చలాన్ల చెల్లింపులకు వినియోగిస్తున్న టీఎస్ ఆర్టీఏ వెబ్సైట్ పై హైదరాబాద్‌కు చెందిన సామాజిక వేత్త విజయ్ గోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్టీఏ ఛార్జీల చెల్లింపులు తప్పనిసరిగా కేంద్ర వెబ్సైట్ లోనే జరపాలని నిబంధన ఉందని చెప్పారు. ఈ విషయంపై ఆయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కేంద్రాల్లో నెలకు దాదాపు 4 లక్షల వాహనాలు వస్తున్నాయని, వీరి నుంచి సర్వీసు చార్జీల పేరిట కోట్లలో వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

అన్ని రాష్ట్రాల్లో ఎంవోఆర్టీహెచ్ ఇండియా ఆధ్వర్యంలో ఎం-పరివాహన్‌టీమ్ తయారుచేసిన వెబ్సైట్‌లోనే చలాన్‌లు కట్టే నిబంధన ఉందని విజయ్ చెబుతున్నారు. అలా కాకుండా సొంతంగా వెబ్సైట్ ఏర్పాటు చేసుకొని సర్వీస్ చార్జీల పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంపై తాను హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆక్సెప్ట్ చేసిందని, గురువారం నోటీస్ కూడా ఇచ్చిందని, అక్టోబర్‌లో కోర్టు హియరింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రకారం..

అండర్ వేర్, బనియన్‌తో ఎమ్మెల్యే.. రైలులో అసభ్యకరంగా తిరుగుతూ..

‘‘My case in TS HC against the illegal usage of @TSRTAIndia website https://t.co/8zK3XOKC24 was accepted & notice issued yesterday, seeking response. Next date in Oct.
State is to use @mParivahanteam made by @MORTHIndia , using own web and charging unreasonable fee is illegal ’’ అని ఉంది.

Next Story

Most Viewed