ఆ తప్పు చేసి దొరికిపోయిన హీరోయిన్ పాయల్.. కేసు నమోదు

by  |
ఆ తప్పు చేసి దొరికిపోయిన హీరోయిన్ పాయల్.. కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ పై కేసు నమోదయ్యింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై పెద్దపల్లిలో కేసు నమోదయ్యింది. వివరాలలోకి వెళితే.. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంకు పాయల్ ముఖ్య అతిధిగా విచ్చేసింది. అయితే మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె కరోనా నిబంధనలు ఉల్లంఘించిందని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేసారు.

పాయల్‌ రాజ్‌పుత్‌ తో పాటు షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, ఆయన భార్యపై పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టులో 12న పిటిషన్‌ దాఖలు వేశారు. పాయల్‌ రాజ్‌పుత్‌, షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గురువారం ఈ కేసు విచారణకు రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీనిపై జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు.

Disha official Facebook page : https://www.facebook.com/Dishacinema



Next Story

Most Viewed