- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్నబ్ గోస్వామిపై కేసు
by Shamantha N |
<p>ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన టీవీ ఛానళ్లోని ఓ ప్రోగ్రాంలో మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు. గత నెల 14న బాంద్రాలోని ఓ ప్రార్థనాలయం సమీపంలో వలస కార్మికులు నిరసన చేపట్టగా, ఆ నిరసనకూ ప్రార్థనాలయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. మత ఘర్షణలు […]</p>

X
ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన టీవీ ఛానళ్లోని ఓ ప్రోగ్రాంలో మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు. గత నెల 14న బాంద్రాలోని ఓ ప్రార్థనాలయం సమీపంలో వలస కార్మికులు నిరసన చేపట్టగా, ఆ నిరసనకూ ప్రార్థనాలయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తోందన్న విధంగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, దీనిపై ఆర్నబ్ స్పందించాల్సి ఉంది.
Tags: arnab goswami, journalist, case, mumbai
Next Story






