హైదరాబాద్ జిల్లాలో 114 పోస్టులు

by Disha Web |
హైదరాబాద్ జిల్లాలో 114 పోస్టులు
X

దిశ,కెరీర్: హైదరాబాద్ లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కాంట్రాక్టు పద్ధతిలో హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు/ఈఎస్ఐ డిస్పెన్సరీలు/ఈఎస్ఐ డయాగ్నస్టిక్ సెంటర్ లలో కింది పోస్టుల భర్తీరి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 59

డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 1

ల్యాబ్ టెక్నీషియన్ - 11

ఫార్మసిస్ట్ - 43

మొత్తం ఖాళీల సంఖ్య: 114

అర్హత: పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు సీఏఎస్, డీఏఎస్ పోస్టులకు రూ. 58,850. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఖాళీలకు రూ. 31,040 ఉంటుంది.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

చివరితేది: మార్చి 28, 2023.

వెబ్‌సైట్: https://hyderabad.telangana.gov.inNext Story