- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టెనోగ్రాఫర్లకు కొలువుల జాతర.. SSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గ్రేడ్ 'సీ' స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ (LDCE)-2025 నోటిఫికేషన్‌ను విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గ్రేడ్ 'సీ' స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ (LDCE)-2025 నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో మొత్తం 326 స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే, ఈ ఉద్యోగాలు రెగ్యూలర్‌గా అపాయింట్ అయిన ‘డీ’ గ్రేడ్ స్టెనోగ్రాఫర్లు మాత్రమే అర్హులు. డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్లకు మాత్రమేనని ప్రకటించారు. విభాగాల వారీగా సెంట్రల్ సెక్రటేరియట్‌లో 267, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో 37, రైల్వే బోర్డ్ సెక్రటేరియట్‌లో 8, ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో 13, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 1, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో స్టెనోగ్రాఫర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జులై 1, 2025 నాటికి అభ్యర్థులు వివిధ కేడర్లలో నిర్దేశిత సర్వీస్ సాధారణంగా 3 నుంచి 6 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. నిర్దిష్ట గరిష్ట వయస్సు లేదు, సర్వీస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBT) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. CBTలో అర్హత సాధించిన వారికి స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సీబీటీ మెరిట్, స్కిల్ టెస్ట్, APAR (Annual Performance Appraisal Report) ఆధారంగా క్యాండిడేట్లను ఎంపిక చేస్తారు. ఈ మేరకు అభ్యర్థులన నుంచి డిసెంబర్ 22 నుంచి 2026, జనవరి 11 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. 2026 సెప్టెంబర్ సెప్టెంబర్‌లో పరీక్ష ఉంటుంది.






