Job Notification: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో భారీ రిక్రూట్‌మెంట్

by Yella Dhawani Reddy |

ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబైలోని తన కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Job Notification: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో భారీ రిక్రూట్‌మెంట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబైలోని తన కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా మొత్తం 372 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్, మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఫ్రెషర్‌లు, అనుభవం ఉన్నవారు, ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్లితే..

విభాగాల వారికి పోస్టులు:

ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌: 10

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సివిల్‌): 50

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ క్వాలిటీ కంట్రోల్‌: 19

ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 35

సీఏ: 24 నీ ఆఫీసర్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌): 06

ఇంజినీర్‌ (మెకానికల్‌): 98

ఇంజినీర్‌ (కెమికల్‌): 26

ఆఫీసర్‌ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌): 01

మేనేజర్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 01

ఇంజినీర్‌ (సివిల్‌): 16

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (మెకానికల్‌): 15

మేనేజీరియల్‌ పోస్టులు: 72

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీటెక్/బీఈ/బీఎస్సీ/డిప్లొమా/సీఏ/ఎంబీఏ/ఎంఏ/పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. కొన్నింటికి సంబంధిత రంగంలో పని అనుభవం అవసరం.

వయోపరిమితి: గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు (పోస్టును బట్టి వయస్సు పరిమితి మారవచ్చు).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2025

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1180గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.

ఎంపిక: సీబీటీ/రాత పరీక్ష/ నెట్‌ స్కోర్‌/ టైపింగ్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ టెస్టుల ఆధారంగా ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://hindustanpetroleum.com/jobnopenings

Next Story