బీఈ, బీటెక్ అర్హతతో బాసర RGUKTలో ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT), తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలోJobs in Basra RGUKT

బీఈ, బీటెక్ అర్హతతో బాసర RGUKTలో ఉద్యోగాలు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT), తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 21

*గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

*ఈ పోస్టులను సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జీ, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ తో పాటు ఎంఈ, ఎంటెక్ పాసై ఉండాలి. పీహెచ్ డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

*సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లో భాగంగా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

*ఈ ఉద్యోగాలకు 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ పాసై ఉండాలి. నెట్‌/ స్లెట్‌/ సెట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story