నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఇండియన్ నేవిలో 2500 ఉద్యోగాలు, త్వరపడండి

by Dishafeatures1 |
నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఇండియన్ నేవిలో 2500 ఉద్యోగాలు, త్వరపడండి
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవిలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2500

*ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2022 మార్చి 29

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 05

*ఇందులో ఆర్టిఫిషర్ అప్రెంటీస్ 500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ 2000 పోస్టులు వేకన్సీ ఉన్నాయి. ఈ కోర్సు బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమవుతుంది.

*విద్యార్హతకు సంబంధించి 60 శాతం మార్కులతో సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.

*నిర్దేశించిన శారీరక ప్రామాణాలు ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2002 ఆగస్టు 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

*ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులని రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్ కాలంలో రూ.14,600 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక నెలకు రూ.21,700 నుంచి రూ.69100 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు.

Next Story

Most Viewed