టెన్త్, డిగ్రీ అర్హతతో RCFL ముంబైలో 137 ఉద్యోగాలు.. భారీ వేతనం, త్వరపడండి..

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(RCFL)లో పలు ఉద్యోగాల భర్తీకి137 jobs in RCFL Mumbai

టెన్త్, డిగ్రీ అర్హతతో RCFL ముంబైలో 137 ఉద్యోగాలు.. భారీ వేతనం, త్వరపడండి..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(RCFL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 137

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 28

*ఇందులో ఆపరేటర్‌(కెమికల్‌ ట్రెయినీ)–133, జూనియర్‌ ఫైర్‌మెన్‌–04 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ) ఉద్యోగానికి సంబంధించి కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ(కెమిస్ట్రీ) పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 మార్చి 1 నాటికి 29 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,000 నుంచి రూ.60,000 వరకు వేతనం చెల్లిస్తారు.


*జూనియర్ ఫైర్ మెన్ ఉద్యోగానికి విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ తో పాటు 6 నెలల ఫుల్‌టైం ఫైర్‌మెన్‌ సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 మార్చి 1 నాటికి 32 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజకల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rcfltd.com వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story