- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్ 19 కారు చూశారా?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. కరోనాను అందరూ మహమ్మారిగా చూస్తుంటే.. కొందరేమో వారికి పుట్టిన పిల్లలకు ‘కరోనా, కొవిడ్’ అనే పేర్లు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కరోనా పేరుతో ఉన్న ఓ బట్టల షాప్, ఆ పేరుతో ఉన్న ఓ ఊరు కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అంతేనా కరోనా స్వీట్లు కూడా తయారు చేశారు. అవన్నీ పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులందర్నీ పరీక్షలు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. కరోనాను అందరూ మహమ్మారిగా చూస్తుంటే.. కొందరేమో వారికి పుట్టిన పిల్లలకు ‘కరోనా, కొవిడ్’ అనే పేర్లు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కరోనా పేరుతో ఉన్న ఓ బట్టల షాప్, ఆ పేరుతో ఉన్న ఓ ఊరు కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అంతేనా కరోనా స్వీట్లు కూడా తయారు చేశారు. అవన్నీ పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులందర్నీ పరీక్షలు లేకుండా పాస్ చేస్తే.. 2019-2020 పాసైన విద్యార్థుల బ్యాచ్‌ను.. మీది ఏ బ్యాచ్? అంటే ‘మాది కరోనా బ్యాచ్’ అంటూ మీమ్స్ కూడా వచ్చాయి. ఇలా ఎక్కడ చూసినా ‘కరోనా, కొవిడ్’ పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విమానాశ్రయ పార్కింగ్‌లో నిలిపిన ఓ కారు కూడా ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్‌లో నిలిచింది. ఇంతకీ ఆ కారు ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా?
అడిలైడ్ ఎయిర్‌పోర్టులో ఉన్న ఓ బీఎమ్‌డబ్య్లూ కారు నెంబర్ ప్లేటుపై ‘కొవిడ్ 19’ అని రాసి ఉంది. లాక్‌డౌన్‌కు ముందు నుంచి కూడా ఆ కారు అక్కడే పార్కింగ్ ప్లేస్‌లో ఉంది. కారు ఓనర్.. లాక్‌డౌన్‌కు ముందే విదేశాలకు వెళ్తూ అక్కడ పార్క్ చేసి వెళ్లినట్టున్నాడు. మళ్లీ వచ్చే అవకాశం లేకుండా విమానాలు రద్దవడంతో.. సదరు ఓనర్ బహుషా అక్కడే చిక్కుకుపోవచ్చు. దీంతో కారు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయింది. మరి మూడు నెలలు కావస్తున్నా.. ఈ కారు గురించి ఏ సమాచారం తెలియలేదా? అనే అనుమానం వస్తుంది కదా! అయితే ఈ కారుపై కవర్ ఉండటంతో, ఎవరికీ ఈ కారు గురించి పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. తాజాగా గాలులు ప్రభావంతో కారుపై ఉన్న కవర్ తొలగిపోవడంతో.. ఆ నెంబర్ ప్లేట్‌పై రాసి ఉన్న కొవిడ్ 19.. ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ కార్మికుడి కంటపడింది. వెంటనే అతను ఆ కారు ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పంచుకోగా కొవిడ్ కారు ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.






