ఉమ్మడి మెదక్​లో మరో రెండు ఎత్తిపోతలు

by Shyam |   (  Updated:2021-09-23 23:07:37  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: నాబార్డు నుంచి అప్పు తీసుకుని మరో రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ రెండింటినీ ఉమ్మడి మెదక్​ జిల్లా పరిధిలోనే నిర్మించనున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2.19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేలా సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 2,653 కోట్ల‌తో [&hellip;]</p>

ఉమ్మడి మెదక్​లో మరో రెండు ఎత్తిపోతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాబార్డు నుంచి అప్పు తీసుకుని మరో రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ రెండింటినీ ఉమ్మడి మెదక్​ జిల్లా పరిధిలోనే నిర్మించనున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2.19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేలా సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 2,653 కోట్ల‌తో నిర్మించ‌నున్నారు. 1.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేలా బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోల‌ను రూపొందించారు. రూ. 1,774 కోట్ల వ్య‌యంతో ఈ ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు.
సంగారెడ్డి, ఆంధోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్‌, ఆంధోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరందుతుంది. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్‌ ఖేడ్‌, ఆంధోల్‌ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు. దీని ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాలకు సాగునీరందుతుంది.

ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. కాళేశ్వరం జలాల్లో భాగంగా కొమురవెల్లి మల్లన్నసాగర్​ నుంచి కాల్వల ద్వారా ఈ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోనున్నారు. సంగమేశ్వరం లిప్ట్​ ఎర్త్​వర్క్​, ఎక్సవేషన్​, కెనాల్​, సీడీ వర్క్స్​, అప్రోచ్​ ఛానల్స్​, కెనాల్​ లైనింగ్​, పంప్​హౌస్​ వంటి పనులన్నీ చేపట్టేందుకు నాబార్డు నుంచి రూ. 2,653 కోట్ల అప్పు తీసుకోనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులో కూడా ఇవే పనులకు రూ. 1774 కోట్లను నాబార్డు నుంచే రుణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Next Story