ఓన్లీ షాపింగ్ కోసం యూట్యూబ్ ప్రత్యేక ఛానల్‌

by Disha Web Desk 17 |
ఓన్లీ షాపింగ్ కోసం యూట్యూబ్ ప్రత్యేక ఛానల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ కొత్తగా ఒక ఛానల్‌ను ప్రారంభించనుంది. ఇది వాణిజ్యం(షాపింగ్) కోసం మాత్రమే. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో తన అధికారిక షాపింగ్ ఛానెల్‌ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని ఈ నెలాఖరులో లాంచ్ చేయనుంది.

జూన్ 30న ప్రారంభం కానున్న ఈ కొత్త ఛానెల్ కంపెనీలకు తమ ఉత్పత్తులను విక్రయించే ప్లాట్‌ఫారమ్‌‌గా ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ కంటెంట్‌ను, ప్రొడక్ట్స్ ఫీచర్స్ గురించి ఈ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఇలా వివిధ బ్రాండ్ ఉత్పత్తులను లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం ద్వారా అమ్మకాలను పెంచుకునే అవకాశం ఉంది. మొదటగా దాదాపు 30 బ్రాండ్‌లతో షాపింగ్ కంటెంట్‌ను లైవ్‌స్ట్రీమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గత ఏడాది, YouTube తన ఎక్స్‌ప్లోర్ విభాగంలో కొత్త షాపింగ్ ట్యాబ్‌ను రూపొందించింది, దీని ద్వారా లైవ్ స్ట్రీమ్‌లలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడంతో పాటు, వారి వీడియోల క్రింద ఉత్పత్తులను లిస్ట్ చేసి, వాటిని వీక్షకులు కొనుగోలు చేసేలా సదుపాయాన్ని అందించింది. కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ మాట్లాడుతూ, ప్రజలు వివిధ రకాలైన ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడాన్ని సులభతరం చేసే విధంగా ఈ కొత్త ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

India Post Payments Bank డిజిటల్ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఓపెన్ చేయండి!



Next Story